గిరిజన ప్రాంతంలో ప్రజలతో మమేకమై పోలీసులతో కలిసి పనిచేయడం అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ చేపట్టిన మీకోసం మీ పోలీస్ అనే కార్యక్రమం లో భాగంగా అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీడిబాబు ఆధ్వర్యంలో మీకోసం మీ పోలీస్ అనే కార్యక్రమం మండలంలోని గంగగుడి గ్రామంలోసినిమా షూటింగ్ నిమిత్తం అరకులోయ వచ్చిన నటీనటులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ నటుడు శ్రీకాంత్, నటుడు రాహుల్, ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ కుమార్తె శ్రీ వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీసులను నమ్మండి, మూడ నమ్మకాల జోలికి పోకండి అని పిలుపునిచ్చారు. గతంలో అరకు లోయలో గంజాయి విపరీతంగా దొరుకుతోందని విన్నాను, అయితే ప్రస్తుతం అరకు లోయలో సీఐగా జీడి బాబు వచ్చిన తర్వాత గంజాయి వంటివి లేకుండా చేశారని తెలిసింది అని అన్నారు.
అందరితో ప్రేమగా ఉండండి, ప్రస్తుత కాలంలో గంజాయి, మూఢనమ్మకాలు ఆరోగ్యాన్ని హాని చేస్తాయని అన్నారు. గంజాయికి బానిసలు అయితే ప్రశ్నించాలనీ, దానివల్ల దేశానికి చాలా ప్రమాదం అన్నారు. రాబోయే తరానికి పోలీస్ వారిని సహకరించి గంజాయి, మూఢనమ్మకాలు పోకుండా గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన పరచాలన్నారు. నటుడు రాహుల్ మాట్లాడుతూ స్నేహ పూర్వక వాతావరణం రోజుల్లో చేతబడులు నమ్మకూడదని, గంజాయి వంటి వాటి జోలికి పోయి జీవితాలను నాశనం చేసుకోకూడదన్నారు. నటి శ్రీ వాణి మాట్లాడుతూ నేను మేడికో స్టూడెంట్ అని ప్రాణం అనేది చాలా ముఖ్యమైనది. చేతబడి మూఢనమ్మకాలకు నమ్మకూడదు, ఒకరినొకరు కొట్టుకొని ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సినీ కమెడియన్లు, పోలీస్ సిబ్బంది, గిరిజనులు, పాల్గొన్నారు.