కడప జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వారి సహకారంతో న్యాయ సేవా సదన్ కడప లో సోమవారం హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బొండెడ్ లేబర్ పై వర్క్ షాప్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎఫ్ఎసి చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ సియన్ మూర్తి, సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్ కవిత విచ్చేయడం జరిగినది.
ఈ సందర్భంగా వన్ స్టాప్ క్రైసిస్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ టీంలో 13 మంది సభ్యులుగా ఎంపిక చేయడం జరిగినది. ఈ టీం జిల్లా వ్యాప్తంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బొండెడ్ లేబర్ పై పనిచేస్తుంది. ఈ టీం జిల్లావ్యాప్తంగా అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తూ బాధితులను ఐడెంటిఫై చేయడము వారికి తగిన న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బొండెడ్ లేబర్ నిరోధించడమే ఈ టీం యొక్క లక్ష్యం. ఈ సందర్భంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బొండెడ్ లేబర్ అంశాలను వివరించడం జరిగినది. వెట్టి చాకిరి పని విధానము నిర్మూలిద్దాం, వ్యక్తి స్వతంత్రాన్ని పరిరక్షిద్దాం అనే పోస్టర్ను ఆవిష్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ క్రైసిస్ టీం మెంబెర్స్ అయిన సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప, డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ వైఎస్ఆర్ డిస్టిక్, రెవెన్యూ డివిజనల్ అధికారి అన్నమయ్య జిల్లా, డి. ఎస్. పి దిశా వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దిశా అన్నమయ్య జిల్లా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కడప, డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎయిడ్స్ కంట్రోల్ కడప, మెడికల్ ఆఫీసర్ అన్నమయ్య జిల్లా, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కడప, డిస్టిక్ ఎస్సీ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ అన్నమయ్య జిల్లా, చంద్రకాంతమ్మ ప్యానెల్ న్యాయవాది కడప, త్యాగరాజు రైట్స్ ఎన్జీవో కడప, దశరథ రామిరెడ్డి పారా లీగల్ వాలంటరిలు, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఎన్జీవో శ్యామ్, ఉజ్వల హోం ప్రతినిధి మూలే సరస్వతి తదితరులు పాల్గొన్నారు.