రాయచోటికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఎంపి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లు కోరారు. సోమవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ లోని మంత్రి కార్యాలయంలో మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లు కలిశారు. నూతనంగా ఏర్పడిన రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉద్యోగులు నివాసాలు ఏర్పరచుకున్నారని, అన్ని వర్గాల విద్యార్థుల సౌకర్యం దృష్ట్యా కేంద్రీయ విద్యాలయం అవసరం ఎంతో ఉందని, స్థల సేకరణ కూడా పూర్తయిందని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోగా రాయచోటిలో కేంద్రీయ విద్యాలయం ప్రారబించాలని మంత్రివర్యులకు మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లు విన్నవించారు. అలాగే మదనపల్లె లో కూడా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, ఈ రెండింటినీ మంజూరు చేసి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే మీ చేతులమీదుగానే ప్రారంభించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లు కోరారు.