వర్షాకాలంలో రోడ్లపై తేమపై వాహనాలు అదుపుతప్పి రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో రెండు కార్లు ఢీకొని, కార్లలోని వ్యక్తులు పక్కన నిలబడి మాట్లాడుకుంటుండగా వేగంగా వచ్చిన మరో కారు రోడ్డుపై తేమకి అదుపుతప్పి రోడ్డు పక్కన కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే చనిపోగా, 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం టర్కీలోని బుర్సాలో జరిగింది.