ఏఐసిసి, పిసిసి, పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆఫీసు వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు పేద ప్రజల సొమ్ము దాచుకోవడం కోసం చాలా ఇబ్బంది పడేవారు. స్వాతంత్ర అనంతరం పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కనిపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్యాంకులు జాతీయకరణ, ఎల్ఐసి వంటి సంస్థలను ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించారు. కానీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను వాటి ఆస్తులను ఆర్థికంగా దివాలా తీసే విధంగా బడా వ్యాపారవేత్తలకు వత్తాసు పలుకుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల ఆదానీ గ్రూప్స్ ఎల్ఐసి, ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద రుణాల తీసుకుని తన వ్యాపారాల్లో వాడుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతూ వ్యాపార అవకతవకులు పాల్పడిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సనపల అన్నాజీరావు, దేశేళ్ల గోవింద మల్లిబాబు, అంబటి కృష్ణారావు, పైడి నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.