ఎస్సీ, ఎస్టీల హక్కుల సాధనకు డి. హెచ్. పి. ఎస్. డైరీ మార్గదర్శిగా పని చేస్తుందని శ్రీకాకుళం ఆర్డీఓ బి. శాంతి అన్నారు. సోమవారం నాడు ఆర్డీఓ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి (డి. హెచ్. పి. ఎస్. )2023 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రి భాయి, భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్, కార్ల్ మార్క్స్ వంటి మహానుభావుల జీవిత చరిత్ర నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాజ్యాంగంలో దళితులకు అనుకూలించే అధికరణలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, జస్టీస్ పున్నయ్య సిఫార్సులు వంటి అంశాలు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో డైరీలో ప్రచురించబడ్డాయని ఆమె అభిప్రాయపడ్డారు.
దళితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల పోలా రావు, యడ్ల గోపి, జిల్లా ఉపాధ్యక్షులు బలగ రామారావు, సామ హిరణ్య రావు, సహాయ కార్యదర్శులు జామాన రామారావు, ముంజేటి రాము, లోపింటి రవి, కె కృష్ణ, ముడిదాన భాస్కర రావు, ఏ. ఐ. టి. యు. సి. జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖ రావు, పంచిరెడ్డి అప్పారావు, ఉప్పాడ సూర్యనారాయణ, గుడ్ల రామకృష్ణ, తవుడు బెహర తదితరులు పాల్గొన్నారు.