యూపీలోని మీరఠ్ ప్రాంతంలో దారుణం జరిగింది. దహర్ గ్రామానికి చెందిన సందీప్ (32), ప్రీతి (28) భార్యాభర్తలు. ప్రీతి తన మేనల్లుడు జానీ (20)తో ఎఫైర్ పెట్టుకుంది. వీరు తమ ఎఫైర్ కొనసాగించేందుకు సందీప్‌ను వదిలించుకోవాలనుకున్నారు. గురువారం సందీప్‌ను చంపేసి, సరూర్‌పూర్ ప్రాంతంలోని రితాలి అటవీప్రాంతంలో పడేశారు. విచారణలో నిందితులిద్దరూ నేరం అంగీకరించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.