టర్కీలో భూకంపం సంభవించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బెంగుళూరులో జరుగుతున్న 'ఇండియా ఎనర్జీ వీక్-2023' కార్యక్రమానికి హాజరైన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా టర్కీ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.