ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం ఎనిమిది గంటల నిద్రపోవాలి. అయితే చాలామందికి రాత్రిళ్లు నిద్రపట్టదు. అలాంటివారు కొన్ని సాధారణ టిప్స్ పాటిస్తే హాయిగా నిద్రపోవచ్చు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ద్వారా నిద్రను మెరుగుపరచుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి నిర్ణీత సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి. పడుకునే ముందు టీ, కాఫీ వంటివి తాగవద్దు. ఇష్టమైన పుస్తక పఠనం, దీర్ఘ శ్వాసలు, ధ్యానంతో గాఢ నిద్రకు ఉపక్రమించవచ్చు.