అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 2,507 మందిని అరెస్ట్ చేసింది. 3,501 ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని, 1,673 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాజధాని తిరువనంతపురంలో అత్యధికంగా 333 అరెస్టులు జరగ్గా, కన్నూర్ జిల్లాలో అత్యధికంగా 257 కేసులు నమోదయ్యాయి.