ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీని పుతిన్ కచ్చితంగా చంపడంటూ నమ్మకం చెబుతున్నారు. గతవారం మాస్కో పర్యటనలో నేరుగా పుతిన్నే 'మీరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా?' అని బెన్నెట్ ప్రశ్నించారు. దీనికి పుతిన్ బదులిస్తూ..తాను చంపాలనుకోవడం లేదని కరాకండీగా చెప్పినట్లు బెన్నెట్ చెబుతున్నారు.