మంత్రి మేరుగ నాగార్జున పై మాజీ సర్పంచి భర్త ఆరోపణలు గుప్పించారు. కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించనివ్వకుండా నాగార్జున అడ్డుపడుతున్నారని.. దళితులను వేధిస్తున్నారంటూ ముల్పూరు మాజీ సర్పంచ్ భర్త మాణిక్య రావు ఓ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అగ్రవర్ణాల చేతిలో మంత్రి కీలు బొమ్మగా మారాడని వీడియో లో ఆరోపించారు. తన భార్య సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామంలో రోడ్లు వేశామని.. ఆ రోడ్లకు సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి నాగార్జున అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అప్పుల బాధతో మానసికంగా కుంగిపోయి వీడియో చేసినట్లు మాణిక్యరావు వెల్లడించారు.