తిరుపతి ఎస్‌బీఐ ముందు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ సోమవారం ఉదయం నిరసనకు దిగారు. రూ.30 వేల కోట్ల రుణాన్ని మోదీ స్నేహితుడు అదానీ కి రాజకీయ పలుకుబడితో ఎస్‌బీఐ కట్టబెట్టిందని ఆరోపించారు. దేశంలోని 24 వేల బ్రాంచ్‌లు ఉన్న ఎస్‌బీఐ దివాలా తీస్తోందని తెలిపారు. ఇంటర్ చదివిన అదానీనికి ఎలాంటి సూరిటీ లేకుండానే రుణాన్ని ఇచ్చారని... దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌బీఐని అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చండి అంటూ ఎద్దేవా చేశారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ కూడా అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా మార్చాలని ఆయన వ్యాఖ్యలు చేశారు.