టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర లో చిత్తూరు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా లాయర్లు మాట్లాడుతూ యువ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధి కోసం చిత్తూరులో లా అకాడమీ ప్రారంభించాలని, న్యాయవాదుల మరణానంతరం కుటుంబాలకు ఇచ్చే భృతిని రూ. 10 లక్షలకు పెంచాలన్నారు. ఆర్థిక భరోసాలేని న్యాయవాదుల కుటుంబసభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని, న్యాయవాదులకు మార్కెట్ ధరపై ఇళ్లస్థలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రూ. 40.32 కోట్లతో చేపట్టిన చిత్తూరు కోర్టు భవన నిర్మాణాలకు నిధులు వెంటనే విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.