ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 60% మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందనేలేదు. ఫిబ్రవరి ఆరో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జీతాలు రాక నెలవారీ ఖర్చులు, అద్దెలు చెల్లించేందుకు సతమతమవుతున్నారు. దీంతో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ఎన్జీవోల సంఘం విజ్ఞప్తి చేసింది. కాగా, ఇవాళ, రేపట్లో జీతాలు చెల్లించనున్నట్లు సమాచారం.