భూకంపం ధాటికి టర్కీ, సిరియా దేశాలు కకావికలం అయ్యాయి. ఎటు చూసినా కూలిన భవనాలు, ప్రజల ఆర్తనాదాలే కనిపిస్తున్నాయి. హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తన్నాయి. భూకంపం కారణంగా దక్షిణ టర్కీలో గ్యాస్ పైప్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణ టర్కీలోని గాజియాంటెప్‌కు నైరుతి దశలో 170 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది.