ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. ఈ 2 దేశాల సరిహద్దుల్లో సంభవించిన వరుస భూకంపాలు పెను విలయం సృష్టించింది. ఎటుచూసినా భవన శిథిలాలు, మృతదేహాల గుట్టలు కనిపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు 2 దేశాల్లో 4000 మందికి పైగా మృత్యువాతపడగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరోవైపు టర్కీలో దశల వారి భూప్రకంపనలతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు.