పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధమని గత నెల ప్రకటించిన ఆయన ఇప్పుడు భారత్‌పై బెదిరింపులకు దిగారు. ‘‘భారతదేశం మాపై డేగ కన్ను వేస్తే.. అణ్వాయుధాలు గల మేము ఆ దేశాన్ని మా పాదాల కిందే నలిపివేయగలం’’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa