ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. భర్త వేధింపులు తాళలేక మహిళ అఘాయిత్యానికి పాల్పడింది. మహాలక్ష్మీ నగర్‌కు చెందిన శివలింగేశ్వరి(27), కుమారులు చరణ్‌సాయిరెడ్డి (8), జతిన్‌రెడ్డి(4)తో కలిసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకుని శివలింగేశ్వరిని వేధించేవాడని పోలీసులు తెలిపారు. ఈక్రమంలో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు చెప్పారు.