భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 35 మంది మృతి చెందిన ఘటన దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వరద బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్ల ద్వారా అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగింది.