గుంతకల్లు పట్టణంలోని అన్ని వార్డు లలో ఇళ్లలోనే చెత్తను తడి, పొడి ప్రమాదకర చెత్తలుగా విభజించి మున్సిపల్ సిబ్బందికి అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సచివాలయ శానిటేషన్ కార్యదర్శు లకు సూచించారు. సోమవారం పట్టణంలోని ఏడవవార్డులోని పాత గుంతకల్లు అంకాలమ్మ గుడి వీధిలో కార్మికులు చేస్తున్న పారిశుద్ధ పను లను కమిషనర్ శేషన్న పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన ఆ కాలనీలోని మహిళలతో మాట్లాడు తూ ఇళ్లలోని చెత్తను (తడి, పొడి, ప్రమాదకర)మూడు విధాలుగా విభజించి ఇళ్ల వద్దకు వచ్చిన చెత్త తరలింపు వాహనాలకు అందించా లని సూచించారు. అదేవిధంగా పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చిన్న లింగన్న, సచివాలయ శానిటరీ కార్యదర్శి పాల్గొన్నారు.