గుత్తి పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన వడ్డే మధు (32) అనే వ్యక్తి సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు మధు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. కుటుంబ సమస్యలతో మానసికంగా కృంగిపోయిన అతడు ఇంటిలో ఎవరు లేని సమయంలో పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసు కున్నా డు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిం చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐతే మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.