ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వివేకానంద కాలనీలో ఇంట్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి చెందిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాలను పగలకొట్టి అందులో ఉన్న మూడు తులాల బంగారం 20 వేల రూపాయల నగదును అపహరించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం శ్రీనివాసరావు హైదరాబాద్ కు వెళ్లి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.