హరిద్వార్‌లోని పూర్ణానంద్ తివారీ లా కాలేజీలో సోమవారం ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. LLB ఐదో సెమిస్టర్ పరీక్ష రాసేందుకు ఓ యువకుడు పెళ్లి దుస్తుల్లోనే పరీక్షా కేంద్రానికి వచ్చాడు. తరుణ్ అనే వ్యక్తికి సోమవారం పెళ్లి జరిగింది. అయితే అదే రోజు పరీక్ష ఉండటంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా ఎగ్జామ్ హాల్‌కి చేరుకున్నాడు. భర్త పరీక్ష రాస్తుండగా వధువు పరీక్షాకేంద్రం బయట కారులో వెయిట్ చేస్తూ కనబడింది.