టర్కీ, సిరియా దేశాల్లో నిన్న 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ప్రకంపనలు ఆగడంలేదు. 24 గంటల్లో రిక్టర్ స్కేల్‌పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో 100 సార్లకు పైగా భూమి కంపించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం ప్రకటించింది. ప్రకంపనలు ఇప్పట్లో ఆగవని మరిన్నిసార్లు భూకంపం సంభవించే అవకాశం ఉందని తెలిపింది. కాగా భూకంప ధాటికి అనేక భవనాలు ధ్వంసమవగా, వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.