మైదుకూరు-పోరుమామిళ్ళ రహదారి కి ఇరువైపుల పెద్ద పెద్ద చెట్లు ఏపుగా పెరిగి బాటసారులకు, వాహనాలకు ఎండాకాలంలో ఉపశమనం కలిగించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాయి. అయితే కేశాలింగాయిపల్లి గ్రామ సమీపంలో కొన్ని చెట్లు కాలం చెల్లి ఎండి పోవడంతో అందహీనముగా ఉండడమే గాక, రోడ్డుకు అడ్డంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఎండిపోయిన చెట్లు వల్ల ఏ క్షణాన ప్రమాదం జరుగుతుందోనని బాటసారులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎండిపోయిన చెట్లను తొలగించాలని వేడుకుంటున్నారు.