సోమవారం మునగపాక వైస్సార్ పార్టీ కార్యాలయం నందు మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఆడారి గణపతి అచ్చినాయుడు ఆధ్వర్యంలో మునగపాక మండలంనకు చెందిన గృహ సారధులు, సచివాలయం కన్వీనర్స్ కి వాలంటీర్స్కి శిక్షణా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంనకు మండల వై.యస్.ఆర్. పార్టీ మండల కన్వీనర్ పొలిమేర పూర్ణ చంద్ర గణేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా యలమంచిలి శాసనసభ్యులు శ్రీఉప్పలపాటి రమణ మూర్తి రాజు, రాష్ట్ర బి. సీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడప్రసాద్ , పెంటకోట స్వామి సత్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, పాల్గొన్నారు.
ఈ సందర్బంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వానికి గృహ సారదులే, ముఖ్య కీలకం వాలంటీర్స్ రధ సారధులు అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి , మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత గృహ సారధులు, సచివాలయం కన్వీనర్లదే అని అన్నారు. కుల మతాలు, వ్యక్తి గత రాజకీయాలు చేయరాదు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. ఈకార్యక్రమనకు స్థానిక నాయకులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లును సమన్వయం చేసుకొంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించి, పార్టీ బలోపేతానికీ కృషి చేయాలని అని అన్నారు. , వాలంటీర్స్ ని. పార్టీ శ్రేణులు, కన్వీనర్ స్ ఎటువంటి ఒత్తిడి కి గురిచేయరాదు. అని ముఖ్య సూచనలు ఇచ్చారు.