ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుతోనే మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 01:55 PM

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం లో అభివృద్ధి కుంటుపడిందని మళ్ళీ చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యాకే రాష్ట్రం అభి వృద్ధికి నోచుకుంటుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సబ్బవరం మండలంలోని బుదిరెడ్లపాలెం లో సోమవారం సాయంత్రం జరిగిన ఇదేం ఖర్మ మన రాస్ట్రానికి కార్యక్రమంలో బండారు సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలదేశం పార్టీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందని, ప్రస్తుత వైసి పి ప్రభుత్వంలో సి ఎమ్ జగన్ ప్రజా సంక్షేమాన్ని గాని , అభివృద్ధిని కానీ పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.


వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేసి భరోసా ఇచ్చేందుకే ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంద న్నారు. ప్రజలు మళ్ళీ టి డిపి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారనడానికి గ్రామాల్లో తమకు ప్రజలు చూపుతున్న ఆధరణే నిదర్శనమన్నారు. రానుంబ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్య అవడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బుదిరెడ్ల శ్రీ లక్ష్మీ కనకరాజు, టి డి పి నాయకులు బుడైరెడ్ల కనకరాజు, తమరాన బంగారు నాయుడు, కోరాడ శ్రీనివాసరావు, రేసుపూడి రమణ, దాడి కన్నం నాయుడు, దాడి లావణ్య, పైడివాడ ఎమ్ పి టి సి, సర్పంచ్ లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com