నందలూరు మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో వందమందికి పైగా విద్యార్థినిలు వైరాల జ్వరాలు, జలుబు, దగ్గుతో బాధపడడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో ఇండ్లకు పంపించినట్లు ప్రిన్సిపాల్ మౌనిక తెలిపారు. తొలుత ఈనెల 4న నిర్వహించిన వైద్య శిబిరంలో 32 మందికి వైరల్ జ్వరాలు వచ్చినట్లు తేలిందని దీంతో వారికి చికిత్స అందించామని, త్రాగునీటి నమూనాలు ల్యాబ్ కు పంపించగా ఎలాంటి సమస్యలు లేదని తేలిందన్నారు. పాఠశాలను మంగళవారం డిఎంహెచ్వో తనిఖీ చేయనున్నారని వారు తెలిపారు.