ప్రొద్దుటూరు స్థానిక కొత్తపల్లె పంచాయతీలోని ప్రకాష్ నగర్ లో సోమవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం 200 వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు తీరును ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, అప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీ, ఎంపిపి శేఖర్ యాదవ్, మండల మాజీ ఉపాధక్షుడు మల్లెల రాజారాంరెడ్డి, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పొరెడ్డి నరసింహారెడ్డి, వార్డు మెంబర్లు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.