డ్వాక్రా సంఘాలు బలోపేత మయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆర్పి లకు సూచించారు్ మంగళవారం పులివెందుల పట్టణంలోని స్థానిక మెప్మా కార్యాలయంలో సీవోలు, ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతిరోజు వార్డుల్లో ఉన్న డ్వాక్రా సంఘాల గ్రూపులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. డబ్బులు సక్రమంగా చెల్లించని వారితో సమావేశం నిర్వహించి డబ్బులు సక్రంగా కట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఓ లు హరిత, నాయుడు, ఆర్పీలు అరుణకుమారి, దేవి, టీఎల్ఎఫ్ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.