కేంద్ర ప్రభుత్వం అప్పర్ బద్రకు జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర బడ్జెట్లో రూ. 5300 కోట్ల నిధులు కేటాయించడంతో ఇది దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అప్పర్ భద్ర నిర్మించడం వల్ల రాయలసీమ శాశ్వితపు ఉరితాడు బిగించినట్టేనని ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ధ్వజమెత్తారు. అప్పర్ భద్ర నిర్మాణం జరిగితే జగన్మోహన్ రెడ్డికి శాశ్వతపు రాజకీయ సమాధి నిర్మించుకున్నట్టేనని తీవ్ర స్థాయిలో విరుచుకబడ్డాడు. మంగళవారం ఆర్ సి పి రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అప్పర్ బద్ర నిర్మాణం జరిగితే అనంతపురం, కడప, కర్నూల్ ఉమ్మడి జిల్లాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే వలసలు, ఆత్మహత్యలతోటి కూనరిల్లుతున్న రాయలసీమ వ్యవసాయం దారుణమైన పరిస్థితిలకు దిగజారుతుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లాకు ఏకైక సాగునీటి ప్రాజెక్టు తుంగభద్ర అన్న సంగతిని పాలకులు గమనించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విలేకరుల సమావేశంలోసీనియర్ కమ్యునిస్టు నేత కె. లింగమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రతాపరెడ్డి, మునిరెడ్డిలు పాల్గొన్నారు.