ఉమ్మడి జిల్లలా కేంద్ర ఆసుపత్రి ప్రభుత్వ జి. జి. హెచ్. గా మారిన తరువాత జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల రోగులు పెద్డ సంఖ్యలో జి. జి. హెచ్. కి చేరుకుంటున్నారని వారికి సరిపడా మౌలిక సదుపాయాలు పెంచవలసిన అవసరం ఉందని లోక్ సత్తాపార్టీ జిల్లా పార్టీ ప్రతినిధి, నియోజకవర్గ అధ్యక్షుడు అల్లంశెట్టి నాగభూషణం అన్నారు మంగళవారం జి. జి. హెచ్ సూపరెంటెండెంట్ శంబంగి అప్పలనాయుడు ని కలసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ జి. జి. హెచ్. లో మంచి వైద్యం అందుతుందనే నమ్మకం ప్రజలకు కలిగిందని అందుకే రోగుల తాకిడి విపరీతంగా పెరిగిందని, రోగులతో పాటు వచ్చే వారి కుటుంబ సభ్యులు ల విశ్రాంతి కోసం నిర్మించిన భవనం మరమ్మతులు లేకుండా చూసి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆసుపత్రి గేటుముందు, లోపల పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ఓపి కోసం ప్రత్యేక భవన ఏర్పాటు చెయ్యడం వలన రద్దీ తగ్గిందని, ఆసుపత్రిలో ని ఉన్న డాక్టర్లు వారి వివరాలు, ఏ డాక్టర్ ఏ ఛాంబర్ లో ఉంటారో తెలియచేసే వివరాల పట్టికలు ఏర్పాటు చెయ్యాలని కోరారు, ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసిన మోటారు సైకిల్, కార్ల పార్కింగ్ ఆసుపత్రి వెనకకు మార్చాలని, రోగులకు అందుతున్న బోజనాల నాణ్యత పై దృష్టి సారించాలని సూపరెంటెండెంట్ కోరారు, ఆసుపత్రి ఆవరణలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని, వృద్ధుల కు సహకారాన్ని అందించే హెల్ప్ డస్క్ ఏర్పాటు చేయాలని వారు కోరారు, జిల్లా ఉన్నత అధికారుల పేర్లు ఫోన్ నంబర్లు తెలిపే పట్టిక, ప్రజా ప్రతినిధుల వివరాలు కూడా తెలిపే వివరాలు పెట్టాలని గతంలో ఆక్షిజన్ ప్లాంట్ కెపాసిటీ పెరుగుదలకు, మార్చురీ భవనం తరలించి నూతన భవనం నిర్మాణం కోసం లోక్ సత్తాపార్టీ తీవ్రంగా కృషి చేసిందని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు తాట్రాజు రాజారావు, కార్యదర్శి పి. ఎల్. ఎన్. రాజు, పిల్లా అదేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.