వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు తెచ్చిన జీవో నెంబర్ ఒకటిని ఉపసంహరించుకోకపోతే ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అన్ని ఏకమై అసెంబ్లీని ముట్టడి చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళ వారం గుంతకల్లు పట్టణంలోని బిటి. పక్కినప్ప భవనంలో మంగళ వారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులు_ జీఓ1 పర్యవసనాలపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు సిపిఐ, టిడిపి, కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, జై భీమ్ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ 13 ఆర్థిక నేరాల్లో ఏ1ముద్దాయిగా ఉన్న సిఎం జగన్ రెడ్డి ప్రతిపక్షాల గొంతులు నొక్కేందుకు జీఓ1 తెచ్చాడని ఎద్దేవా చేశారు. ఆ జిఓ ఉపసంహరణ చేయకపోతే అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.