టర్కీలో ఘోర భూకంపం సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, భూకంప బాధితులకు సాయం అందిచేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. 6 టన్నుల ఎమర్జెన్సీ రిలీఫ్ అసిస్టెన్స్‌తో పాటు ప్రాణాలను రక్షించే మందులు మరియు అత్యవసర వైద్య వస్తువులతో భారతీయ వైమానిక దళానికి చెందిన C130J-హెర్క్యులస్ విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్ నుండి సిరియాకు బయలుదేరింది.