ఇంటి స్థలం తనకే అమ్మాలంటూ వేధింపులకు గురి చేయడంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఏలూరు ప్రభు త్వాసుపత్రికిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘంటా అరుణ కేసులో వైసీపీ నాయకులు గేదెల సూర్యప్రకాష్‌ను, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే.... పోణంగికి చెందిన అరుణకు ఇంటి స్థలం ఉంది. అది తనకే అమ్మాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడని, వేధింపులు భరించలేక 5వ తేదీ పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె వాం సూర్యప్రకాష్పైపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సూర్యప్రకాష్‌పై 306, 354 బి, 324, 34, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.