గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి రావి వెంకటేశ్వరరావు అరెస్ట్ కు సంబంధించి సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పేదల గుడిసెలు పీకేస్తుంటే రావి గట్టిగా నిలువరించారన్నారు. పేద దళితులకు చెందిన ఇళ్లను కూలదోస్తుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఇక్కడి నుండే నానికి పతనం ప్రారంభమైందన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రావి శోభనాద్రి పెట్టిన రాజకీయ భిక్షతో ఎమ్మెల్యే అయిన కొడాలి నాని నేడు అదే కుటుంబంపై కక్ష సాధింపునకు దిగి వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడన్నారు. పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వర్ల కుమారరాజా మాట్లాడుతూ.... కేసినో, పేకాట, ఇసుక, మట్టి దోపిడీతో కొడాలి నాని వేలకోట్లు అక్రమార్జన చేశాడన్నారు. రాత్రి అంతా పమిడిముక్కల స్టేషన్‌లో రావికి సంఘీభావంగా ఉన్నారు. పట్టణ, రూరల్ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, వాసే మురళీ, బాధితులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.