కార్పొరేట్, ఆన్‌లైన్ మెడికల్ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 15 నుంచి నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపారులు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపడతున్నట్టు ఆల్ ఇండియా ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి కె.పి.రంగారావు తెలిపారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ఫార్మారంగంలో వ్యాపారులతో పాటు ప్రజల కూడా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అక్రమ వ్యాపారం, నకిలీ మందులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిరసనల్లో భాగంగా అన్ని జిల్లా కార్యాలయాల ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందిస్తామన్నారు.