ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అన్ని కాలాలలోని గొప్ప ఉపాధ్యాయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సావిత్రీబాయి ఫూలే
సావిత్రీబాయి భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. 1831 జనవరి 3వ తేదీన జన్మించిన సావిత్రీబాయి ఫూలే సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. ఆమె బ్రిటీష్ పాలనలో మహిళల హక్కు కోసం ఒక స్టాండ్ తీసుకుంది. 18 పాఠశాలలను నిర్మించింది. మహిళలను చదువుకునేందుకు ప్రోత్సహించింది.
చాణక్యుడు
చాణక్యుడు అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ గురువులలో ఒకడు. తక్షిలా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ బోధించే ప్రొఫెసర్‌గా పనిచేశారు. అతను చంద్రగుప్త మౌర్యకు సలహాదారుగా పనిచేశాడు.
జాన్ ఆడమ్స్
1735 అక్టోబరు 30న జన్మించిన జాన్ ఆడమ్స్, యునైటెడ్ స్టేట్స్ రెండవ అధ్యక్షుడు, వోర్సెస్టర్‌లో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. అతను రాజ్యాంగం యొక్క ముసాయిదా, స్వాతంత్య్ర ప్రకటనలో సహాయం చేశాడు. గ్రేట్ బ్రిటన్ తో శాంతి ఒప్పందంపై సంతకం చేశాడు. విప్లవ యుద్ధం ముగియడానికి ఈ ఒప్పందం కారణమైంది.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. అతను భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. డాక్టర్ రాధాకృష్ణన్ తన జీవితంలో చాలా గొప్ప పనులు చేసారు. 1954లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించబడ్డారు.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ప్రపంచానికి అత్యంత ప్రసిద్ధ మాస్-ఎనర్జీ ఈక్వేషన్, సాధారణ సాపేక్షత, బ్రౌనియన్ చలన సిద్ధాంతంతో పాటు మరెన్నో అందించాడు.