ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి సంపద 2.5 ఏళ్లలోనే 13 రెట్లు పెరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. 'అతని సంపద 2014లో రూ.50 వేల కోట్లుగా ఉండేది. 2019కు రూ.లక్ష కోట్లు అయింది. కానీ తర్వాత రెండేల్లలో రూ. 12 లక్షల కోట్లు అయింది. మోదీ స్నేహం వల్లేనా?' అని ప్రశ్నించారు.