ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహారం అధిక కేలరీలతో కూడిన వంటకంగా ఖ్యాతిని పొందింది. ఆరోగ్యకరమైన, ఫిట్ బాడీ విషయానికి వస్తే క్రెడిట్ అంతా భారతీయ జీవనశైలికే చెందుతుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఈ క్రింది వాటిని మీరు అనుసరించాలి.
1. మీరు ఎప్పుడూ తినేదే తినండి
మీకు ఏది సరిపోతుందో మీ అమ్మకు బాగా తెలుసు. ఆమె మీకు అత్యుత్తమ నాణ్యమైన ఆహారం, సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. మీ తల్లి మీకు ఇచ్చిన ఆహారానికి కట్టుబడి ఉండండి. మీరు చాలా వ్యాధుల నుండి దూరంగా ఉంటారు.
2. సరైన సమయంలో తినండి
ప్రతి కుటుంబానికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కోసం ప్రత్యేక సమయం ఉంటుంది. ఈ తినే సమయాలను ఎక్కువసేపు అనుసరించడం ద్వారా మీ శరీరం ఆ సమయానికి మాత్రమే అనుకూలంగా మారుతుంది. సరైన సమయంలో తినకపోవడం చెడు జీర్ణక్రియ, అనారోగ్యకరమైన ప్రేగు వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సరైన సమయంలో తినడానికి ప్రయత్నించండి.
3.తినడానికి మరియు వండడానికి సరైన పాత్రలను ఎంచుకోండి
ఆయుర్వేదం ప్రకారం మీ డిన్నర్ ప్లేట్‌లను సాంప్రదాయ రాగి ప్లేట్ తో భర్తీ చేయడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాగి ప్లేట్ లో తింటే ఆహారం, తాగే నీరు గుండె, మూత్రపిండాలకు మంచిది. బరువు తగ్గాలని ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ రాగి పాత్రలతో తినడానికి ప్రయత్నించాలి. పాతకాలం వలె మట్టి కుండలో ఆహారాన్ని వండాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా శరీరానికి సరైన పోషకాహారాన్ని అందిస్తూ రుచిని కూడా పెంచుతుంది.
4.ఇంట్లో తయారుచేసిన వంటకాలను తినడం
సాంప్రదాయ వంటకాలు పోషక విలువలను కలిగి ఉంటాయి. ఆ వంటకాలు మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగించే ఫాస్ట్ ఫుడ్ ను దూరం పెట్టి ఇంట్లో తయారు చేసిన వంటకాలను తినడం మంచిది.
5.మీరు తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి
మంచి, చెడు ఆహారాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు భారతీయ ఇంట్లో తయారుచేసిన ఆహారాలు ఆరోగ్యకరమైనవి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే కొన్ని ఆహారాలను దూరం పెట్టాలి. కాబట్టి మీరు ఏదైనా తినడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. తినే ఆహారాలను వివిధ భారతీయ వంటకాల నుండి ఎంచుకోండి.
6.తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి పని చేయండి
మనం తిన్న ఆహారం జీర్ణం కావాలి. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే వర్కవుట్ చేయాల్సి ఉంటుందని వైద్యుల అభిప్రాయం. భోజనం చేసిన తర్వాత ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బరువు పెరగడంతో పాటు ఇతర వ్యాధులు కూడా వస్తాయి. సాంప్రదాయకంగా భారతదేశంలో ప్రజలు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడరు. వారి స్వంత పనిని చేసుకుంటారు. ఇది జీవించడానికి ఆరోగ్యకరమైన మార్గాలలో ఒకటి.