రెండ్రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. ఊహించినట్లుగానే RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచడం, అదానీ ఎంటర్ ప్రైజెస్, పేటీఎం, రిలయన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించటం సూచీలకు కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్ 60,663.79 వద్ద, నిఫ్టీ 17,871.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.50గా ఉంది.