మధ్యప్రదేశ్ లో విచిత్రమైన వివాహం జరిగింది. పిపారియా ప్రాంతానికి చెందిన రామస్వరూప్ పరిహార్ అనే వ్యక్తి మైనా పక్షిని, అదే ప్రాంతానికి చెందిన బాదల్ లాల్ విశ్వకర్మ ఓ చిలుకను పెంచారు. వీరిద్దరూ రెండు పక్షులకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆదివారం ముహూర్తం ఖరారు చేసి గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో భాజా భజంత్రీల నడుమ పక్షులకు ఘనంగా పెళ్లి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.