వచ్చే ఏడాది లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న సంకల్పంతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టు ప్రధాన ‘ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్’ కింది భాగంలో.. అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్‌ను కాఫర్ డ్యామ్‌లు నిర్మించకుండానే చంద్రబాబు సర్కారు నిర్మించిందని.. దీని వల్ల వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇటీవలే డయాఫ్రమ్ వాల్‌కు టోమోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. వచ్చే రెండు మూడు నెలల్లో దాని ఫలితాలను విశ్లేషించాక డయాఫ్రమ్ వాల్ భవితవ్యం ఏంటనేది తేలనుంది. పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యామ్ పనులు వేగంగా సాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. 2024 మార్చిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్రం ఇటీవల ప్రకటించింది.