భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న సిరియా, టర్కీకి కేరళ ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఆపరేషన్ దోస్త్ పేరిట రెస్క్యూ టీంలను, ఆహార పదార్థాలను టర్కీ, సిరియాలకు పంపించింది. తాజాగా కేరళ ప్రభుత్వం రూ.10 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు కేరళ ఆర్థిక శాఖ మంత్రి బాలగోపాల్ కేరళ అసెంబ్లీలో ప్రకటన చేశారు.