ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న ఛారియట్ ప్రొడక్షన్స్ మీడియా ఓనర్ రాజేశ్ జోషిని ఈడీ అరెస్టు చేసింది. సౌత్ గ్రూప్ తరపున రూ.31 కోట్ల నగదును అతడు దినేశ్ అరోరాకు అందజేసినట్లు ఈడీ భావిస్తుంది. కాగా, ఈ కేసులో నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.