దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో ఆస్తమా ఒకటి. అయితే, కొన్ని సహజ పద్ధతులతో ఆస్తమా అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. ప్రతి రోజూ యోగా, ధ్యానం వంటివి చేయాలి. వేడి నీటిలో అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి మరిగించి చల్లారాక తాగాలి. ఆహారంలో పాలు, గుడ్లు, చేపలు ఉండేలా చూసుకోవాలి. ఆస్తమా బాధితుల్లో కెఫిన్ ఉన్న పానీయం చాలా మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.