ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మానవమలంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించిన పరిశోధకులు రాబోయే ముప్పు గురించి వివరించారు. క్యాన్సర్తో పాటు పలు రకాల అనారోగ్యాలకు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల వినియోగమే కారణం అవుతోందంటున్నారు. ప్లాస్టిక్ నీళ్ల సీసా తయారీలో వాడే పాలిథిలిన్ టెరాఫ్తాలేట్ నుంచి మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు కనిపెట్టారు.