ఓ వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం అతను కూర్చునే విధానం బట్టి చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాళ్లు అడ్డంగా పెట్టి కూర్చునే వారు సృజనాత్మక స్వభావులు. కుర్చీపై కూర్చునేటప్పుడు మోకాళ్లు దగ్గరగా ఉంచి పాదాలు దూరంగా ఉంచేవారు బాధ్యతలు తీసుకోరు. అలాగే, కాళ్లను మోకాలి నుంచి క్రిందకు స్ట్రెయిట్ గా కూర్చునే వారు క్రమశిక్షణతో జీవిస్తారు. కుర్చీ, సోఫాలో కూర్చునేటప్పుడు పాదాలను అతికించి, కొంచెం వాలుగా కూర్చునే వారు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు.