రోజూ డార్క్ చాక్లెట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చాక్లెట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని పేర్కొంటున్నారు. అలాగే, డిప్రెషన్ కు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు. అధిక బరువుతో బాధ పడేవారు డార్క్ చాక్లెట్ తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. డార్క్ చాక్లెట్ లో ఫాలిఫెనాల్స్, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో రక్తం చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.